Back to Home
Watermark
ఆదివారం, 27 సెప్టెంబర్, 2026 TIME : 06:45 PM

ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవకు నిదర్శనం 'సేవా సంకల్ప్ అభియాన్'.. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

Main Image

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా (బీజేపీవైఎం) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

రక్తదానమే అత్యంత పవిత్రమైనది: ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు శ్రమిస్తూ, 25 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మార్గనిర్దేశనంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని కొనియాడారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే రక్తదానం ఎంతో పవిత్రమైనదని, ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించిన బీజేపీవైఎం ప్రతినిధులను అభినందించారు. ఈ శిబిరంలో యువకులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.

మహిళా సాధికారత - స్వయం ఉపాధి: ఇదే రోజు సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్స్ (SIBS) బ్యూటీ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సర్టిఫికేషన్ ప్రదానోత్సవ కార్యక్రమంలోనూ యాదగిరి సునీల్ రావు పాల్గొని మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. గత పదేళ్లుగా 'సిబ్స్' సంస్థ ద్వారా దాదాపు 2,500 మందికి పైగా మహిళలకు బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణనిచ్చి, వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా తీర్చిదిద్దిన నిర్వాహకురాలు స్వప్నను అభినందించారు. ఒక కుటుంబం ఆనందంగా ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దబడాలన్నా మహిళా సాధికారత ఎంతో కీలకమని పేర్కొన్నారు.

మన్ కీ బాత్ వీక్షణ: కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా అభ్యర్థులందరూ కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 138వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు గుజ్జ శ్రీనివాస్, చొప్పరి జయశ్రీ, పొన్నం మొండయ్య, మాసం గణేష్, గాజె శివరాం, ఎన్నం ప్రకాష్, బీజేపీ జోన్ అధ్యక్షులు అవదుర్తి శ్రీనివాస్, తణుకు సాయికృష్ణ, పాదం శివరాజ్, బండారి గాయత్రి, నాయకులు చంద్రమౌళి, చాడ ఆనంద్, గర్థస్ సతీష్, అడిచెర్ల రాజు, గుంజెటి శివకుమార్, పండుగ నాగరాజు, నక్క ప్రమోద్, కడర్ల విమల్ కుమార్, వెంకటేష్ అన్నాజీ, వీనీత్ గున్నాల, కన్నంబ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments