సుడా పగ్గాలు వి. నరేందర్ రెడ్డికి దక్కనున్నాయా? కరీంనగర్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ

సుడా పగ్గాలు వి. నరేందర్ రెడ్డికి దక్కనున్నాయా?
కరీంనగర్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందనే అంశంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, వీఎన్‌ఆర్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉన్న అనుబంధం, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్రతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సుడా చైర్మన్ పదవికి ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
వీఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా విద్యారంగంలో కొనసాగుతున్న సేవలు కూడా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయని పేర్కొంటున్నారు.
సుడా చైర్మన్ పదవిపై జరుగుతున్న ఈ చర్చకు ప్రభుత్వం నుంచి అధికారిక నిర్ణయం వెలువడితేనే స్పష్టత రానుంది. ప్రస్తుతం డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పేర్లలో ఒకటిగా చర్చ సాగుతోంది.