బోయినిపల్లి లో నవీన హాస్పిటల్ నూతన క్లినిక్ ప్రారంభం

తెలంగాణ అడ్డా బోయినిపల్లీ ప్రతినిధి:
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధునిక, అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో 'నవీన హాస్పిటల్' సౌజన్యంతో ఏర్పాటు చేసిన నూతన క్లినిక్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. పాత సెస్ (CESS) కార్యాలయ ప్రాంగణంలోని నూతన షట్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ (MBBS, DA), మాట్లాడుతూ.. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సాధారణ అనారోగ్యం మొదలుకొని అత్యవసర వైద్య సేవల కోసం పట్టణాలకు, సుదూర ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోందని, దీంతో సమయంతో పాటు తీవ్ర ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు, గ్రామీణ ప్రజలకు స్థానికంగానే తక్షణ రోగ నిర్ధారణ, మెరుగైన ఓపీ సేవలు, ప్రాథమిక అత్యవసర చికిత్సలు, సెలైన్/ఇంజెక్షన్ సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగిన వైద్య పర్యవేక్షణ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
ప్రజల సొంత ఆస్పత్రిగా సేవలు:
ఈ క్లినిక్‌ను మండల ప్రజలు తమ సొంత హాస్పిటల్‌గా భావించి సేవలను వినియోగించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వృద్ధులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక వైద్య సూచనలు అందిస్తూ, అత్యవసర సమయాల్లో ప్రాణాపాయం కలగకుండా తక్షణ చికిత్స అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని వైద్యులు స్పష్టం చేశారు.
తరలివచ్చిన నాయకులు, శ్రేయోభిలాషులు:
కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. బీఎస్పీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బహుజన టీచర్స్ ఫెడరేషన్ (బీటీఎఫ్) నాయకులు, స్థానిక పెద్దలు మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రారంభం అనంతరం పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు మరియు వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు