Back to Home
Watermark
మంగళవారం, 29 సెప్టెంబర్, 2026 TIME : 12:19 PM

రాజన్న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ.సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ప్రముఖ నాయకులు!

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేపు జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు మరియు ప్రముఖ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది.

సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన వసతులు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ మరియు ఇతర భద్రతా చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

సమీక్షలో పాల్గొన్న ప్రముఖులు:

ఈ పరిశీలన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్‌లు శ్రీ ఆది శ్రీనివాస్ (విజయ రమణ రావు) గారు, శ్రీ వేముల వీరేశం గారు, అలాగే శాసనసభ్యులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, శ్రీ మేడిపల్లి సత్యం గారు, డీసీసీ అధ్యక్షులు శ్రీ సంగీతం శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు శ్రీ కె.కె. మహేందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. సభా ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించి, ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని నేతలు అధికారులను కోరారు.

రేపు జరగనున్న ఈ మహాసభను అత్యంత విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Clip Adjustments