Back to Home
Watermark
మంగళవారం, 29 సెప్టెంబర్, 2026 TIME : 02:55 PM

రేపు కరీంనగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు రేపు ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ముమ్మర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

సభకు, ప్రారంభోత్సవానికి విచ్చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, భద్రతా చర్యలపై తగిన సూచనలు చేయడం జరిగింది.

రేపటి పర్యటన ముఖ్య కార్యక్రమాలు:

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ: నూతన కలెక్టరేట్ భవనం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

కలెక్టరేట్ ప్రారంభోత్సవం: అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

బాధ్యతల స్వీకరణ: సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ ఛాంబర్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, కలెక్టర్‌ను వారి ఛాంబర్‌లోని సీట్లో ఆసీనులను చేసి అధికారికంగా పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

సమీక్షా సమావేశం: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అర్బన్ డెవలప్‌మెంట్ తదితర కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

వినతిపత్రాల స్వీకరణ: కార్యక్రమం చివరిలో ప్రజాప్రతినిధులు మరియు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించనున్నారు.

ఈ మహాకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

Clip Adjustments