Back to Home
Watermark
మంగళవారం, 29 సెప్టెంబర్, 2026 TIME : 04:37 PM

అభివృద్ధి కోసం నిధులతో వస్తే స్వాగతిస్తాం కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత జక్కుల నాగరాజు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 30న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, తంగళ్లపల్లి మండల ప్రజల తరఫున పలు కీలక డిమాండ్లను బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత జక్కుల నాగరాజు తెరపైకి తెచ్చారు. సిరిసిల్లకు అభివృద్ధి నిధులతో వస్తే స్వాగతిస్తామని, అంతేకానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

కేటీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధే గీత:

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా కేటీఆర్ ప్రాతినిధ్యంలో సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన సర్వతోముఖాభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించాలని నాగరాజు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు, సమీకృత కలెక్టరేట్, మెడికల్, నర్సింగ్, జేఎన్టీయూ, మరియు అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు వంటి చారిత్రాత్మక మార్పులను సీఎం సభలో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, కేజీ టూ పీజీ విద్యాసంస్థలు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల అభివృద్ధి తీరును తెలుసుకోవాలని సూచించారు.

తంగళ్లపల్లి మండలానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి:

గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న తంగళ్లపల్లిని ఎంతో దూరదృష్టితో మండల కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్‌దేనని గుర్తుచేశారు. తంగళ్లపల్లి మండల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించాలని, అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామానికి కనీసం రూ. 1 కోటి చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ విమర్శలు మాని అభివృద్ధిపై మాట్లాడాలి:

సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ఇక్కడి అభివృద్ధి, ప్రజా సమస్యలు మరియు పెండింగ్ నిధుల కేటాయింపులపై మాట్లాడాలని హితవు ప。లిశారు. కేటీఆర్‌పై నిరాధారమైన వ్యక్తిగత విమర్శలు చేయకుండా, గౌరవప్రదమైన ప్రజాస్వామిక చర్చ జరగాలని జక్కుల నాగరాజు డిమాండ్ చేశారు.

Clip Adjustments