Back to Home
Watermark
మంగళవారం, 29 సెప్టెంబర్, 2026 TIME : 08:09 PM

కేంద్ర ప్రభుత్వంపై, రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనులకు మరియు దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టಿಸುತ್ತన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​ఈసీపై కాంగ్రెస్ అనుచిత విమర్శలు హేయం:

గత వారం రోజులుగా ఏదో ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం అత్యంత హేయమైన చర్య అని యాదగిరి సునీల్ రావు మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ 2025 ఫిబ్రవరి నెలలోనే బాధ్యతలు స్వీకరించగా.. అంతకుముందు జరిగిన అనేక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయాలు సాధించిందని, దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయత్నాన్ని విశ్వసించి నిరంతరం ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు.

​ఈవీఎంల నుంచి ఎస్ఎస్ఆర్ (SSR) వరకు నిరాధార ఆరోపణలు:

గతంలో ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని ప్రచారం చేసిన కాంగ్రెస్.. ప్రజలు ఆ మాటలను నమ్మకపోవడంతో ఇప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) ప్రక్రియపై బురదజల్లే యత్నం చేస్తోందని విమర్శించారు. చట్టబద్ధంగా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను చేపడుతుందని, ముగ్గురు కమిషనర్లు సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించిన తర్వాతే ఇది అమలవుతుందని తెలిపారు. ఎస్ఎస్ఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, ఒకవేళ కమిషన్ బీజేపీకి సహకరిస్తే ఆయా రాష్ట్రాల్లో విపక్షాలు ఎలా గెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నికల కమిషన్‌‌ను, రాజ్యాంగ పదవులను స్వప్రయోజనాల కోసం వాడుకున్న చరిత్ర ఆ పార్టీదని, గతంలో సీఈసీగా పనిచేసిన ఎం.ఎస్. గిల్ వంటి అధికారులను పార్టీలో చేర్చుకుని ఎంపీ, కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఎత్తిచూపారు.

​రాజ్యాంగ వ్యవస్థల పట్ల బీజేపీకి గౌరవం:

బీజేపీ ఎన్నడూ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేసిన సునీల్ రావు.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) ఇంటింటికీ తిరిగి పత్రాలను పరిశీలించిన తర్వాతే ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు నగరాలు మరియు గ్రామాలు రెండింటిలోనూ నివసిస్తుండటంతో కొంత సమస్య తలెత్తుతోందని, ఒక పౌరుడికి ఒకే ప్రాంతంలో ఓటు హక్కు ఉండాలన్న నిబంధన మేరకు ఎన్నికల కమిషన్ తన బాధ్యతను నిర్వహిస్తోందని చెప్పారు.

​దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు:

కాంగ్రెస్ పార్టీ నిన్న ఈవీఎంలు, నేడు ఎస్ఎస్ఆర్, రేపు రాముడు-శివుడు అంటూ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో స్థానిక దేవుళ్ల పేరిట ప్రమాణాలు చేసే కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు రాముడిని, శివుడిని వేరుచేస్తూ మాట్లాడటం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. మన శాస్త్రాలు "శివాయ విష్ణు రూపాయ.. విష్ణు రూపాయ శివవే" అని చెప్పాయని, రాముడు, శివుడు వేర్వేరు కాదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కాశీ విశ్వనాథ్ ధామ్‌ను పునర్నిర్మించి, హిందూ ధర్మ విశ్వాసాలను, ఆలయ వైభవాన్ని పునరుద్ధరించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నరేంద్ర మోదీ వైపే ఉన్నారని, రాబోయే రోజుల్లోనూ బీజేపీకి మద్దతు తెలుపుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

​ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు బండారి వేణు, బండ రమణా రెడ్డి, మేకల వెంకటేష్, భూపతి రవీందర్, రామన్, నాంపల్లి శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, దేవసాని సత్యనారాయణ, సర్దార్ బల్విందర్ సింగ్, మహమ్మద్ ముజీబ్, పండుగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments