పేద విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు, పలకల పంపిణీ...

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మంగళ వారం సుమారు 2000 మంది విద్యార్తిని విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ వారు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు, అంగన్వాడీ పిల్లలకు పలకలను పంపిణీ చేశారు. మండల పరిధిలోని మణుగూరు అశ్వా పురం, పినపాక ఈ మూడు మండలాలల లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు *గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సామాగ్రిని మణుగూరు మండల ఎం ఈ ఓ జి స్వర్ణ జ్యోతి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మణుగూరు మండల ఎం ఈ ఓ స్వర్ణ జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థులందరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగివుండాలని వ్యక్తిగత క్రమశిక్షణ, నైతిక విలువలు కలిగి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువుకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ప్రతీ సంవత్సరం అందిస్తున్న చేయూత చాలా అభినందనీయమన్నారు. కార్యక్ర మాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటు న్నామన్నామని అన్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యా యులు,గ్రామస్తులు,తల్లిదండ్రులు సంస్థ ప్రతినిధులు శామ్యూల్,అశోక్ ,మురళి రెడ్డి, సురేష్ పాల్గొన్నారు. సహాయం అందించిన దాతలకు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.