నిజాన్ని నిర్భయంగా రాయాలి, నైతిక విలువలను కాపాడాలి. -

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి...
తెలంగాణ అడ్డ న్యూస్/బోధన్ డివిజన్ ప్రతినిధి:
జర్నలిస్టులు సమాజంలో నైతిక విలువల ను కాపాడుకుంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురా వాలని తెలంగాణ మీడియా అకాడ మీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సూచించా రు. ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాస్తూ, ప్రజలకు వాస్తవాలను చేరవేసే బాధ్యతా యు తమైన పాత్రికేయు లుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలు, మండలాలకు చెందిన జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడి యా అకాడమీ ఆధ్వర్యంలో బాన్సు వాడలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ముగి శాయి.ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కె.శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు.పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు చేరే వార్తలు వాస్తవాధారంగా, ఆసక్తికరంగా, సమాజానికి ఉపయోగ పడేలా ఉండాలని ఆయన సూచించా రు. జర్నలిస్టులు కేవలం వార్తలను అందించడానికే పరిమి తం కాకుండా ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధులుగా పనిచేయా ల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు.శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ హాజర య్యారు.అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీపీఆర్వో, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు.అలాగేటీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర నాయకులు ఇంద్రసేనారెడ్డి, లతీఫ్, జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు ఎర్రవట్టి పోశిరాం, మొయినుద్దీన్, గంట చంద్రశేఖర్, మారుశెట్టి హనుమాడ్లు, కోటగిరి సతీష్, రుద్రంగి అశోక్, బర్ల సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.