జాతీయ యోగా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించాలి రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి ఎన్. సిద్ధారెడ్డి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్న 51వ జాతీయ స్థాయి జూనియర్స్ మరియు సబ్ జూనియర్స్ యోగా ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు అధిక సంఖ్యలో పతకాలు సాధించాలని రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి ఆకాంక్షించారు. ఈనెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగే ఈ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు 40 మంది సభ్యులతో కూడిన తెలంగాణ జట్టు గురువారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి జైపూర్‌కు పయనమైంది.
ఈ సందర్భంగా తెలంగాణ యోగ అసోసియేషన్ తరఫున క్రీడాకారులందరికీ, కోచ్‌లు, మేనేజర్లు మరియు రెఫరీలకు ట్రాక్ సూట్లను స్పాన్సర్ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే టీం సభ్యులందరికీ వరంగల్ యోగ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బొలిశెట్టి కమలాకర్, పి. రవీందర్ రిఫ్రెష్మెంట్లు అందజేశారు.
క్రీడాకారులను తెలంగాణ యోగ అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి, యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు జాల మనోహర్, నిజామాబాద్, కరీంనగర్, హనుమకొండ, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల యోగ అసోసియేషన్ కార్యదర్శులు మరియు సభ్యులు సి.హెచ్. గంగాధర్, గుంటి రామకృష్ణ, గుగులోత్ కిషన్ నాయక్, పి. కిరణ్, సాయినాథ్, పి. సాగర్, ఆనంద కిషోర్, అభిషేక్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రం పేరును పతకాల పట్టికలో ముందంజలో నిలపాలని వారు పిలుపునిచ్చారు.