Back to Home
Watermark
గురువారం, 01 అక్టోబర్, 2026 TIME : 04:33 PM

అర్హత ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్ అందించాలి..

Main Image

కార్మికుల సమస్యలపై ఎస్ఓ టు జీఎంకు వినతి పత్రం అందజేసిన కర్నె బాబు.

తెలంగాణ అడ్డా న్యూస్. భద్రాద్రి జిల్లా ప్రతినిధి.

మణుగూరు సింగరేణి ఏరియాలో కార్మికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సామాజిక సేవకులు, కర్నే బాబురావు గురువారం సింగరేణి ఎస్ఓ టు జీఎం డి. వెంకట రామా రావుకి వినతిపత్రం అందజేశారు.

రహదారిపైకి వాలిన చెట్ల కొమ్మలతో ఇబ్బందులు

బొంబాయి కాలనీ నుంచి పీవీ కాలనీ లోని సింగరేణి సొసైటీ హైస్కూల్ వరకు రహదారికి ఇరువైపులా పెరిగి న చెట్ల కొమ్మలు రహదారిపైకి వాల డం వల్ల వాహనదారులు, సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.ముఖ్యంగా విధులకు వెళ్లే, కార్మికులకు ఈ కొమ్మలు ప్రమా దకరంగా మారాయని తెలిపారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలకు రహదారి వెడల్పు తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే స్థల పరిశీలన చేసి కొమ్మలను తొలగించా లని కోరారు.అదేవిధంగా సింగరేణి సొసైటీ హైస్కూల్ నుంచి సీతానగర్ రోప్‌వే లైన్ వరకు రహదారికి ఇరువై పులా చెత్తాచెదారం పేరుకుపో యిందని, దీనివల్ల దుర్వాసన, అపరి శుభ్ర వాతావరణం ఏర్పడి దోమలు, ఈగలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.రహదారి పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించ డంతో పాటు, భవిష్యత్తులో చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి నిరంతర పారిశుధ్య చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్ ఇవ్వాలి..

సింగరేణి సంస్థ అభివృద్ధిలో పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కీలకమని కర్నే బాబురావు పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా అర్హత ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, సంస్థ విధానాల ప్రకారం బోనస్ లేదా చట్టబద్ధంగా వర్తించే లాభాల వాటా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు తగిన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కర్నే బాబురావు మాట్లాడుతూ, కార్మికు లు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయ డం తన సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

Clip Adjustments