Back to Home
Watermark
గురువారం, 01 అక్టోబర్, 2026 TIME : 05:01 PM

స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

Main Image

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..

తెలంగాణ అడ్డా న్యూస్. భద్రాద్రి జిల్లా ప్రతినిధి..

Additional Image

మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీలు మరియు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను, అలాగే 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులను పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర శాసన సభ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు గురు వారం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలోని ప్రజా ప్రభు త్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజ నాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోందని, పేద కుటుంబాలకు నిత్యావసర సరుకు లతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేం దుకు స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతా యని పేర్కొన్నా రు.పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వ ర్యంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడు తోందన్నారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజ నాలు అందించ డమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.అదేవిధంగా ఆడబిడ్డ ల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిం చేందు కు అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి,షాదీ ముబార క్ పథకం ద్వారా 33 మంది లబ్ధిదారు లకు చెక్కులు అందజే యడం జరిగిం దన్నారు.పేద కుటుంబా లకు ప్రభు త్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం వివాహ సమ యంలో ఎంతో ఉపయో గకరంగా ఉంటుందని తెలిపారు. పినపాక నియోజకవర్గంలోని అర్హులై న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా తన వంతు కృషి కొనసాగి స్తానని పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్ర మంలో డీటీ రామా రావు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, సివిల్ సప్లై అధికారి ప్రభాకర్ రావు, మండల అధ్యక్షులు పిరిణాకి నవీన్, టౌన్ అధ్యక్షులు కుర్రం రవి, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపస

ర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments