ఈ నెల 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ జాతీయ స్థాయి ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలి

ఈ నెల 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ
ఎంఎస్ఎఫ్ జాతీయ స్థాయి ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలి
కోనరావుపేట తెలంగాణ అడ్డా, అక్టోబర్ 1:
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్ఎఫ్ నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ కోనరావుపేట మండల అధ్యక్షుడు అక్కనపెల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బిక్షపతి మాదిగ మాట్లాడుతూ, సమాజంలోని సబ్బండ వర్గాల కోసం పోరాటాలు చేసి సేవలందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌కు ఉందన్నారు. ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, తెల్ల రేషన్ కార్డుల బియ్యం కోటా పెంపు వంటి పలు సామాజిక అంశాలపై ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 6న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎంఎస్ఎఫ్ జాతీయ స్థాయి ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంఎస్ఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నేరెళ్ల హర్షవర్ధన్ మాదిగ, అధికార ప్రతినిధిగా ఎర్రగళ్ల సృజన్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి గణేష్ మాదిగ, కోశాధికారిగా కన్నం రాహుల్ మాదిగ, కార్యదర్శిగా బొడ్డు యశ్వంత్ మాదిగలను నియమించారు.
అమ్మాయిల విభాగం: అధ్యక్షురాలిగా తంగళ్లపల్లి కావ్య మాదిగ, అధికార ప్రతినిధిగా దప్పుల మేఘన మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మల్యాల లిప్సిక మాదిగ, కోశాధికారిగా మల్యాల ప్రణీత మాదిగ, కార్యదర్శిగా గుడికందుల హాసిని మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కోనరావుపేట గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లి బాబు మాదిగ, ఎగ్లాస్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాను మాదిగతో పాటు పలువురు పాల్గొన్నారు.