మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి...

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేసిన కాంట్రాక్టు ఉపాధ్యా యులు...
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచే స్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయు లు పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ సంఘం కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుని శుక్రవారం మణుగూ రు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉపా ధ్యాయులుగా విధులు నిర్వహి స్తున్న తమకు మినిమం టైం స్కేల్ అమలు చేయ డంతో పాటు 61 సంవత్సరాల వయస్సు వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ఎమ్మెల్యే ని కోరారు.ఎన్నో సంవత్సరాలు గా విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ ఆశ్రమ పాఠశాలల్లో తమ సేవలను అందిస్తున్నామని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశా రు.ఈ సందర్భంగా ఉపాధ్యా యులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసు కువచ్చారు. కాంట్రాక్టు ఉపాధ్యా యుల సమస్య లను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకె ళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు.గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలు కీలకమని, వారి సమస్యల పరిష్కా రానికి ప్రభు త్వం తీసుకునే చర్యలకు తన వంతు సహకారం అందిస్తా నని ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లు తెలిపారు.ఈ కార్యక్ర మంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రా క్టు ఉపాధ్యా యుల సంఘం జిల్లా అధ్య క్షులు పి.శ్రీనివాస్,ఉపాధ్యక్షులు బి.శంకర్,ఎస్.చిట్టి బాబు,కార్యవర్గ సభ్యులు డి.నాగేశ్వ రరావు,బి.జనార్ధన్,టీ.రజిత,బి. వసంత తదితరులు పాల్గొన్నారు.