సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఎన్‌ఈహెచ్‌ఎస్ (NEHS) ద్వారా చికిత్స అందేలా చూడాలి ఎమ్మెల్సీ శ్రీ పాల్‌రెడ్డికి టీఎస్‌జీఆర్‌ఈఏ కరీంనగర్ జిల్లా శాఖ వినతి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (TSGREA) కరీంనగర్ జిల్లా శాఖ భవనంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పాల్‌రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను సంఘం ప్రతినిధులు ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు కొన్ని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి:
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఎన్‌ఈహెచ్‌ఎస్ (NEHS) కింద నిరంతరంగా చికిత్స అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, ఆసుపత్రులు వైద్యం అందించేందుకు అంగీకరించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు టీఎస్‌జీఆర్‌ఈఏ కరీంనగర్ జిల్లా శాఖ తరఫున ఎమ్మెల్సీ శ్రీ పాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ పాషా, ప్రధాన కార్యదర్శి జాలి మహేందర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి పొలాస రామచంద్రం, రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ గౌడ్, జిల్లా కార్యదర్శులు కాజా శంషాద్దీన్, రమణ, ప్రచార కార్యదర్శి శ్రీధర్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ చోటా మియా, మానకొండూరు మండల శాఖ అధ్యక్షులు ఆర్. మల్లయ్య, సీనియర్ పెన్షనర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.