Back to Home
Watermark
శుక్రవారం, 02 అక్టోబర్, 2026 TIME : 09:28 PM

కమలాపూర్ లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

Main Image

తెలంగాణ అడ్డా న్యూస్, కమలాపూర్:

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఝాన్సీరాణి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ చరిత్ర, సేవలను వక్రీకరించే ప్రయత్నాలను ఖండించాలని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) పేరును మార్చడం, పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, జనగాని శివకృష్ణ, ఆకినపల్లి బిక్షపతి, గట్టు శ్రీధర్, కిన్నెర కృష్ణమూర్తి, కార్యదర్శి జన్ను యాకయ్య, అబ్బరవేణి అనిల్‌తో పాటు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

Clip Adjustments