చదువు చెప్పాల్సిన టీచరే కసాయిగా మారితే...?

ఎవరో చెప్పిన దానికి పిల్లలపై దండన బాధాకరం..
ప్రధాన ఉపాధ్యాయురాలే.. పిల్లలపై వాతలు దులిపిస్తే... ఇంకా ఉపాధ్యాయులు,,?
జిల్లా విద్యాధికారి కఠిన చర్యలు తీసుకోవాలి, పిల్లల తల్లిదండ్రులు.

తెలంగాణ అడ్డా న్యూస్,,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
చదువు చెప్పాల్సిన టీచరే కసాయిగా మారింది. పిల్లలు అల్లరి చేశారన్న కోపంతో కనికరం లేకుండా పైప్ తో చితకబాదింది. దీంతో 12 మంది విద్యార్థుల ఒంటిపై బలమైన వాతలు తేలాయి. ఈ దారుణం మణుగూరు మండలం రామాను జవరం జెడ్పీ హైస్కూల్ లో చోటు చేసుకుంది. గాంధీ జయంతి రోజు పక్క స్కూల్ లో ఐరన్ పోల్ విరగొట్టారని ప్రైమరీ టీచర్ ఫిర్యాదు చేయడమే కారణం దీనంతటికీ
దీన్ని మనసులో పెట్టుకున్న ప్రధానో పాధ్యాయురాలు యశోద పిల్లలపై ప్రతాపం చూపించింది. పిల్లల లేత శరీరం పై దెబ్బలు తగులుతుంటే దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తున్నా వినలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తు న్నారు.ఇంటికి వెళ్లాక పిల్లల ఒంటిపై వాతలు చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. పిల్లల ఫోటోలు సోషల్ మీడి యాలో వైరల్ కావడం గమనార్హం.తరగతి గది తలుపులు మూసి మరీ పై పుతో దాడి చేశారని, బయటకు వచ్చే టప్పటికి ఒంటిపై చారలు, వాతలతో పిల్లలు బిక్కచచ్చి పోయా రని తోటి వి ద్యార్థులు చెబుతున్నా రు.ఇంట్లో తల్లి దండ్రులు బట్టలు మార్చే సమయంలో గాయా లు చూసి నివ్వెరపోయారు.పి ల్లలను కొట్టే తీరు చూస్తే అది దండన లా కాదు.. పగబట్టి కొట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాల అంటే పేద పిల్లలు చదువు కునే చోటు.అలాంటి చోట భయాన్ని సృష్టిస్తే పిల్లలు బడికి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు.విద్యా హక్కు చట్టం ప్ర కారం పిల్లలను కొట్టడం నేరమని,అ లాంటిది హెచ్ఎం స్థాయి వ్యక్తే చట్టా న్ని ఉల్లంఘించడం సిగ్గుచేటని విద్యా ర్జి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే డీఈఓ స్పందించి విచారణ జరిపి ప్రధానో ధ్యాయురాలు పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..