Back to Home
Watermark
ఆదివారం, 04 అక్టోబర్, 2026 TIME : 05:18 PM

ఉత్సాహంగా కరీంనగర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అత్యంత ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

ఈ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలింగ్ కేంద్రానికి స్వయంగా విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజంలో రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లే నూతన పాలకవర్గ ఎంపిక కోసం జరుగుతున్న ఈ ఎన్నికలపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ పోలింగ్ ప్రక్రియలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, రెడ్‌క్రాస్ ఆజన్మ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును చాటుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు మరియు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Clip Adjustments