మణుగూరు సింగరేణి ఎస్సీ సివిల్ కాంట్రాక్టర్ల నూతన కమిటీ ఎన్నిక....

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
సింగరేణి సంస్థలో సివిల్ కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్న ఎస్సీ కమ్యూనిటీకి చెందిన కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, ఐక్యత కోసం నూతన కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహిం చారు.ఆదివారం మణుగూరులో జరిగిన ఈ ఎన్నికల్లో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన సింగరేణి సివిల్ కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతినిధులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. కాంట్రా క్టర్లకు ఎదురవు తున్న సమస్యలను సింగరేణి యాజమా న్యం దృష్టికి తీసుకెళ్లడం, పనుల విషయం లో సమాన అవకాశాలు కల్పించేలా కృషి చేయడం, కాంట్రాక్టర్ల హక్కుల కోసం సంఘటితంగా పోరాడడం నూతన కమిటీ ప్రధాన లక్ష్యాలుగా నాయకు లు తెలిపా రు.ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కాంట్రాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.కాంట్రాక్ట ర్లందరినీ కలుపుకొని, ఎస్సీ కమ్యూ నిటీకి చెందిన సివిల్ కాంట్రాక్టర్ల అభివృద్ధి కోసం నిరంత రం కృషి చేస్తామని పేర్కొన్నారు.సింగరేణి సంస్థలో కాంట్రాక్టర్లకు సంబంధించిన సమ స్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్చల ద్వారా కృషి చేస్తామని నూతన కమిటీ ప్రతినిధులు తెలిపా రు.అలాగే కాంట్రాక్టర్ల మధ్య ఐక్యత ను పెంపొందిస్తూ భవిష్య త్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేప డతామని వెల్లడించారు.
నూతన కమిటీ .
గౌరవ అధ్యక్షులు: రాజ్ వీర్ .
గౌరవ సలహాదారు: మునిగెల రమేష్
అధ్యక్షులు: కటుకూరి శ్రీనివాస్ రావు
ఉపాధ్యక్షులు: ముసలి శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి: శనిగారపు సునీల్
కార్యదర్శి: గోవింద శ్రీనివాస్
కోశాధికారి:చింతమల్ల రమేష్
14 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.కార్యక్రమంలో సింగరేణి సివిల్ కాంట్రాక్టర్లు, సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.