Back to Home
Watermark
సోమవారం, 05 అక్టోబర్, 2026 TIME : 05:22 PM

బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుగులోతు విజయదేవికి యాదగిరి సునీల్ రావు సన్మానం, శుభాకాంక్షలు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా (State Executive Member) నూతనంగా నియమితులైన గుగులోతు విజయ దేవిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరియు ఎస్టీ మోర్చా బలోపేతానికి ఆమె శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తూ, రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత బలోపేతంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.

తనకు ఈ ఉన్నత బాధ్యత లభించడం పట్ల ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుగులోతు విజయ దేవి హర్షం వ్యక్తం చేశారు. తనను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించిన యాదగిరి సునీల్ రావుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Clip Adjustments