Back to Home
Watermark
సోమవారం, 05 అక్టోబర్, 2026 TIME : 07:20 PM

మణుగూరు కాంట్రాక్ట్ కార్మికులకు 10% లాభాల బోనస్ ఇవ్వాలి....

Main Image

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 2025-26 వార్షిక లాభాల్లో 10% బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐఎన్టీయూ ఆధ్వర్యంలో మణుగూ రు జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం జీఎం రామచందర్కు వినతిపత్రం సమర్పిం చారు.ఈ సంద ర్భంగా ఐఎన్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వర రావు మాట్లాడు తూ,దసరా పండుగకు ముందే 10% లాభాల బోనస్ ప్రకటించి కాంట్రాక్ట్, కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.అక్టోబర్ 7న కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాను కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మంగీలాల్, సాధనపల్లి రవి, అలివేలు,కాంతారావు,శ్రీకాంత్, సంజీవ రావు,టి.రాము, తాటి వెంకటేశ్వర్లు, గుర్రపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments