Back to Home
Watermark
సోమవారం, 05 అక్టోబర్, 2026 TIME : 08:46 PM

బోయినిపల్లి మండల కేంద్రానికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరుఎమ్మెల్యే సత్యంకు కృతజ్ఞతలు తెలిపిన సువీన్ యాదవ్

Main Image

యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కీలక ముందడుగు

క్రీడాల మంత్రి వాకిటి శ్రీహరితో తో ప్రత్యేకంగా మాట్లాడి మంజూరు చేయించిన వైనం

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.. హర్షం వ్యక్తం చేసిన మండల ప్రజలు

ఎమ్మెల్యే సత్యంకు కృతజ్ఞతలు తెలిపిన సువీన్ యాదవ్

బోయిన్పల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రానికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరైంది. బోయినిపల్లి గ్రామంలో మినీ స్టేడియం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అక్టోబర్ 3, 2026న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ మినీ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు.

యువతకు క్రీడా వేదిక

Additional Image

మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటుతో స్థానిక యువతకు క్రీడల్లో శిక్షణ పొందేందుకు, ప్రతిభను చాటుకునేందుకు మెరుగైన వేదిక అందుబాటులోకి రానుంది. వివిధ క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో

చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం యువత, క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధితో ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడి మినీ స్టేడియం మంజూరుకు కృషి చేశారని బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ తెలిపారు.

రూపాయలు 12 కోట్ల నిధులతో ప్రభుత్వా అనుమతి

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లోని నిధుల నుంచి రూ.12 కోట్లను మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులతో బోయినిపల్లి మండలంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి మార్గం సుగమమైంది.

ఎమ్మెల్యేకు సువిన్ యాదవ్ కృతజ్ఞతలు

బోయినిపల్లి మండలానికి మినీ స్టేడియం మంజూరు చేయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సువీన్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ మినీ స్టేడియం మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మండల ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Clip Adjustments