కరీంనగర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న 'అల్ఫోర్స్' డా. వి. నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సార్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, 'అల్ఫోర్స్' విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి స్వయంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజానికి రెడ్‌క్రాస్ సొసైటీ వారు అందిస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయమని, అన్ని వర్గాల ప్రజలకు ఆపద్బాంధవులా నిలుస్తూ చేయుతనివ్వడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజంలో నిస్సహాయులకు సేవనందించడంలో రెడ్‌క్రాస్ సంస్థ తలమానికంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రతిష్టాత్మక సొసైటీలో సభ్యత్వాన్ని పొంది, సంస్థ ద్వారా అందించే సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు, నాయకులను కలిసిన డా. నరేందర్ రెడ్డి.. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులపై వారితో ముచ్చటించారు.