Back to Home
Watermark
మంగళవారం, 06 అక్టోబర్, 2026 TIME : 06:49 PM

రూ. 15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్ అరెస్ట్

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

సిద్దిపేట జిల్లాలో అవినీతి అధికారులపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఇంటి మ్యూటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కారు.

​ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బి. అరుణ విధులు నిర్వర్తిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరు మీద ఉన్న రెండు ఇళ్లకు సంబంధించి మ్యూటేషన్ (Mutation) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపించేందుకు పంచాయతీ కార్యదర్శి అరుణ తొలుత రూ. 20 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితుడు వేడుకోవడంతో చివరకు రూ. 15 వేలకు ఒప్పందం కుదిరింది.

​బాధితుడి నుంచి అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అక్టోబర్ 6వ తేదీ ఉదయం సుమారు 11 గంటల సమయంలో జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆకస్మిక దాడి చేశారు. పంచాయతీ కార్యదర్శి సూచన మేరకు కాంట్రాక్ట్ కారోబార్ దాసరి సంతోష్ బాధితుడి నుంచి రూ. 15 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

​అరెస్ట్ చేసిన నిందితులను హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు.

​ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్: 1064

​వాట్సాప్ నంబర్: 9440446106

Clip Adjustments