Back to Home
Watermark
మంగళవారం, 06 అక్టోబర్, 2026 TIME : 08:55 PM

బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోతు తిరుపతి నాయక్‌కు యాదగిరి సునీల్ రావు సన్మానం,

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

భారతీయ జనతా పార్టీ (BJP) గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన గుగులోతు తిరుపతి నాయక్‌ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరియు ఎస్టీ మోర్చా బలోపేతానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తూ, రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత బలోపేతంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.

తనకు ఈ ఉన్నత బాధ్యత లభించడం పట్ల గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోతు తిరుపతి నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. తనను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించిన యాదగిరి సునీల్ రావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Clip Adjustments