Back to Home
Watermark
మంగళవారం, 06 అక్టోబర్, 2026 TIME : 09:52 PM

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి

Main Image

వేములవాడ తెలంగాణ అడ్డా ప్రతినిధి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీనివాసులు తెలిపారు.

హైదరాబాద్‌లోని డా. బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం తదితర నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, సంబంధిత అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీనివాసులు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధతో పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Additional Image

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని, అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.

శ్రీ విధుశేఖర భారతి స్వామి, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు భక్తుల విశ్వాసాలు, అవసరాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ పనులను చేపట్టాలని పేర్కొన్నారు. నిర్మాణ పనులను అధికారులు తమ బాధ్యతగా భావించి పూర్తిస్థాయిలో నిమగ్నమై నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Clip Adjustments