Back to Home
Watermark
బుధవారం, 07 అక్టోబర్, 2026 TIME : 04:55 PM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులు....

Main Image

గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం.

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

Additional Image

మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని సుందరయ్య నగర్‌లో నూత నంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారుల కుటుంబాలను అభినం దించారు.నూతన గృహాల్లోకి అడుగుపె డుతు న్న కుటుంబాలతో ఎమ్మెల్యే పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద ర్భంగా తన్నీరు రతమ్మ, బెక్కం శ్రావణి, గనిబోయిన విజయ నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత గృహం లభించడం సంతో షకరమైన విషయమని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ఇంటిలో కుటుం బ సభ్యులతో కలిసి సుఖసంతోషా లతో జీవించాలని ఆకాంక్షించారు.పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృ త్వంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హులైన కుటుం బాలకు మేలు జరుగుతోందన్నారు. ముఖ్యంగా సొంత ఇంటి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయో గకరంగా ఉందని తెలిపారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార & పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో గృహ నిర్మాణా నికి సంబంధించిన కార్యక్రమాలను ప్రభు త్వం ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ ఏఈ, సంబం ధిత అధికారులు, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, జిల్లా ముఖ్య నాయకులు, మహిళా అధ్యక్షురా లు కూరపాటి సౌజన్య, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments