Back to Home
Watermark
బుధవారం, 07 అక్టోబర్, 2026 TIME : 05:27 PM

తెలంగాణ రక్షణ సేనలోకి నిర్మల్ బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్య చేరిక

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

హైదరాబాద్:

నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్యతో పాటు, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారికంగా 'తెలంగాణ రక్షణ సేన' పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వారందరికీ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

​ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన ప్రముఖులు:

​సర్పంచులు: టేకం లక్ష్మణ్, గడ్డం భీముడు, కె. రాజేందర్, కస్తూరి అర్జున్, శ్రీపెల్లి శేఖర్.

Additional Image

​ఉప సర్పంచులు: పి. రాజు, చింటు కాంతి, గంపల భూమన్న.

​ఇతర నాయకులు: మాజీ ఎంపీటీసీ సభ్యులు రామ్ సింగ్, షిండే సదాశివ, మాజీ సర్పంచులు ఎ. శంకర్, నాయకపోడ్, వివిధ కోలం సంఘాల ప్రముఖులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.

​నాయకులకు కవిత దిశానిర్దేశం:

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నిర్మల్ జిల్లా మరియు ఖానాపూర్ నియోజకవర్గ నాయకులను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ నెలలో ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించ తలపెట్టిన 'పాంచజన్య సంకల్ప సభ'ను అత్యంత విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.

Clip Adjustments