Back to Home
Watermark
బుధవారం, 07 అక్టోబర్, 2026 TIME : 08:34 PM

బోయినిపల్లికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరుకు యువత సంబరాలు.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఘన స్వాగతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు

Main Image

తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి

బోయినిపల్లి మండల కేంద్రానికి మినీ స్టేడియం మంజూరు కావడంతో బోయినిపల్లి యువత ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు.

మినీ స్టేడియం మంజూరులో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ చూపారని యువత పేర్కొన్నారు. మండల యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Additional Image

ఈ సందర్భంగా బోయినిపల్లి మండల కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు యువత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు, నినాదాలతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ఒగ్గుడోలు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. మినీ స్టేడియం నిర్మాణంతో బోయినిపల్లి యువతకు క్రీడల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మినీ స్టేడియం మంజూరు బోయినిపల్లి మండలంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు పేర్కొన్నారు.

Clip Adjustments