బాహ్య మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా విద్యాధికారి ఏ. శారద

తెలంగాణ అడ్డా ప్రతినిధి పెద్దపల్లి సుల్తానాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 9వ తరగతి సమ్మేటివ్–1 బాహ్య మూల్యాంకన కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి ఏ. శారద సందర్శించారు.
ఈ సందర్భంగా బాహ్య మూల్యాంకన ప్రక్రియను పరిశీలించిన జిల్లా విద్యాధికారి, మూల్యాంకన విధానంపై సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తున్న సమ్మేటివ్ పరీక్షలను పరిశీలించారు.
అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ మూల్యాంకన కేంద్రంలో ప్రతిరోజూ 322 పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల కమిషనర్ వి. హనుమంతు, మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య, క్యాంప్ ఆఫీసర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. శ్రీనివాస్ రెడ్డి, కే. లింగయ్య, 9 మంది మూల్యాంకనకులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.