బతుకమ్మ వేడుకల కోసం ఆటస్థలం చదును గ్రామ ప్రజలంతా ఒకే చోట బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలి: సర్పంచ్ సుద్దాల మధు

తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలో ఆటస్థలాన్ని చదును చేయించారు. గ్రామ ప్రజలందరూ ఒకే చోట చేరి బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సుద్దాల మధు మాట్లాడుతూ, గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ ఒకే ఆటస్థలంలో బతుకమ్మ వేడుకలను ఐక్యంగా, ఘనంగా జరుపుకోవాలని కోరారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆటస్థలాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుద్దాల మధు, ఉపసర్పంచ్ బేతి లావణ్య గంగమల్లు తదితరులు పాల్గొన్నారు.