Back to Home
Watermark
శుక్రవారం, 09 అక్టోబర్, 2026 TIME : 09:36 PM

మాంటిస్సోరి హైస్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు...!

Main Image

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు.. రంగురంగుల పూలతో బతుకమ్మల అలంకరణ

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

Additional Image

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చాపల మార్కెట్ ఏరియాలో ఉన్న శ్రీ సత్య భాస్కర మాంటిస్సోరి హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో విద్యార్థినులు,ఉపాధ్యాయులు ఉత్సా హంగా పాల్గొని పాఠశాల ఆవరణలో పండుగ శోభను నింపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ థామస్ మాట్లాడు తూ... ఉపాధ్యాయులు,విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందమైన బతుక మ్మలను పేర్చారని తెలిపారు.అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదా య బతుకమ్మ పాటలు పాడుతూ,నృత్యా లతో వేడుకలను ఉత్సాహ భరితంగా నిర్వహించారని పేర్కొ న్నారు.ఈ సంద ర్భంగా ఉపాధ్యా యులు మాట్లాడు తూ..బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలు స్తుందని అన్నారు.మహిళల ఐక్యత, ఆత్మగౌరవం,ప్రకృతితో మానవాళికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని వివరించారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే మన సంస్కృతి,సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించి, వాటి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాల ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతి బింబించేలా నిర్వహించిన ఈ ముందస్తు బతుకమ్మ సంబరాలు అందరినీ ఆకట్టు కున్నాయి.

Clip Adjustments