Back to Home
Watermark
శుక్రవారం, 09 అక్టోబర్, 2026 TIME : 09:41 PM

ఫారం-7 దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి అవకతవకలకు తావుకూడదు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎంఐఎం నేతలు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముద్రిత ఫారం-7 అభ్యంతర పత్రాల పెద్దఎత్తున దాఖలవుతున్న వైనంపై సమగ్ర మరియు పారదర్శక పరిశీలన జరపాలని కోరుతూ ఎంఐఎం నాయకులు జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏఐఎంఐఎం కరీంనగర్ జాయింట్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులామ్ అహ్మద్ హుస్సేన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఈ వినతిపత్రం సమర్పించినట్లు వారు తెలిపారు.

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా.. ఇప్పటికే ఉన్న ఓటర్లను తొలగించే దుద్దేశంతో ముందుగా ముద్రించిన ఫారం-7 అభ్యంతర పత్రాలను భారీగా సమర్పిస్తుండటం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని సయ్యద్ గులామ్ అహ్మద్ హుస్సేన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమస్యను నివారించడానికి క్షేత్ర స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

గ్రేటర్ హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలలో బూటకపు 'ఫారం-7' పత్రాలు వెలుగుచూసిన నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ నాయకులు హాఫిజ్ సయ్యద్ మొయీనుద్దీన్ ఖాద్రి, మాజీ కార్పొరేటర్లు ఆరిఫ్ అహ్మద్, అహ్మద్ మొహియుద్దీన్ బాబుజాని, లింగపల్లి శ్రీనివాస్; నాయకులు అబ్దుల్ గఫార్, సురేష్, ఖాజా మజారుద్దీన్, వాజిద్ అలీ ఖాన్, ఎంఏ సలీం, సాజిద్, అబ్దుల్లా ఖాన్; సిరిసిల్ల నాయకులు పర్వేజ్; పెద్దపల్లి నాయకులు ఇమ్రాన్ (అడ్వకేట్), ఉమర్, కలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments