Back to Home
Watermark
శుక్రవారం, 09 అక్టోబర్, 2026 TIME : 09:44 PM

కరీంనగర్ ఏఐఎంఐఎం (AIMIM) నూతన టౌన్ అధ్యక్షుడిగా మహమ్మద్ అతిఫ్ (అథినా) నియామకం.. మత సామరస్యమే మా ధ్యేయమన్న నూతన అధ్యక్షుడు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ జాతీయ అధ్యక్షులు, అల్-హాజ్ బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ గురువారం కరీంనగర్ నూతన టౌన్ అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు (జాయింట్ సెక్రటరీలు), కోశాధికారి మరియు ఇతర కార్యవర్గ సభ్యులను నియమించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ అతిఫ్ (అథినా) మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ టౌన్ అంతటా ఏఐఎంఐఎం పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకెళ్లేందుకు అంకితభావంతో కృషి చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 66 డివిజన్లలోని ప్రస్తుత డివిజన్ అధ్యక్షులందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం కమిటీలు లేని డివిజన్లలో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని డివిజన్ అధ్యక్షుల స్థానంలో కొత్తవారిని నియమిస్తామని, అవసరమైన చోట నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. కరీంనగర్ టౌన్ పరిధిలోని అన్ని 66 డివిజన్లలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి, క్షేస్థ్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని మహమ్మద్ అతిఫ్ వెల్లడించారు.

మా ప్రధాన లక్ష్యం మత సామరస్య పరిరక్షణ:

ఈ సందర్భంగా మహమ్మద్ అతిఫ్ మాట్లాడుతూ.. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు సహా అన్ని మతాల ప్రజలతో కలిసికట్టుగా, అందరి సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కరీంనగర్ నౌన్‌లో అన్ని వర్గాల ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత మరియు మత సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక కృషి చేస్తామని ఉద్ఘాటించారు.

కరీంనగర్ టౌన్ అధ్యక్షుడిగా తన నియామకానికి మద్దతు తెలిపిన పార్టీ నాయకులకు, తనకు అండగా నిలిచిన కరీంనగర్ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన అభిప్రాయాలను, సందేశాన్ని ప్రజలకు చేరవేయడంలో సహకరిస్తున్న అన్ని దినపత్రికలు, మీడియా సంస్థలు, ప్రెస్ ప్రతినిధులు మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

నూతనంగా నియమితులైన పార్టీ కార్యవర్గ సభ్యులు:

మహమ్మద్ అతిఫ్ (అథినా) – కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు

మొహ్సిన్ మొహియుద్దీన్ – కార్యదర్శి (సెక్రటరీ)

సయ్యద్ బర్కత్ అలీ – సంయుక్త కార్యదర్శి (జాయింట్ సెక్రటరీ)

మొహమ్మద్ అజారుద్దీన్ దబీర్ – సంయుక్త కార్యదర్శి (జాయింట్ సెక్రటరీ)

మొహమ్మద్ ఖుర్షీద్ @ బాజ్ – సంయుక్త కార్యదర్శి (జాయింట్ సెక్రటరీ)

సయ్యద్ ఖమరుద్దీన్ – సంయుక్త కార్యదర్శి (జాయింట్ సెక్రటరీ)

సయ్యద్ ఇబ్రహీం బియాబాని – కోశాధికారి (టెర్రరర్/ట్రెజరర్)

ఈ కార్యక్రమంలో ముక్రాంపూర్ కార్పొరేటర్ మజిద్ హుస్సేన్ తో పాటు ఏఐఎంఐఎం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్ లోని అన్ని 66 డివిజన్లలో ఏఐఎంఐఎంను బలోపేతం చేయడం, విస్తృత సభ్యత్వ నమోదు చేపట్టడం, డివిజన్ స్థాయి కమిటీలను పటిష్టం చేయడం, అన్ని వర్గాల ప్రజలతో సమన్వయంతో పనిచేయడమే పార్టీ ప్రధాన లక్ష్యాలని నూతన టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ అతిఫ్ పునరుద్ఘాటించారు.

Clip Adjustments