కరెంటు కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా వెంకట్రావుపల్లి సబ్‌స్టేషన్ ముందు ఆందోళన

తెలంగాణ అడ్డా బోయిన్పల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు గంటపాటు ధర్నా నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో నీలోజుపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్, మానువాడ సర్పంచ్ కట్ట గోవర్ధన్‌తో పాటు వివిధ హోదాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు