Back to Home
Watermark
శనివారం, 10 అక్టోబర్, 2026 TIME : 07:00 PM

వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీకి ప్రత్యేక క్యాంపులు...

Main Image

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.. ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నా లక్ష్యం...

పోచారం భాస్కర్ రెడ్డి మాజీ డిసిసి బి చైర్మన్ ఉమ్మడి జిల్లా

నిజామాబాద్

తెలంగాణ అడ్డా బోధన్/ డివిజన్ ప్రతినిధి:

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క వికలాంగుని కి వారి అవస రాలకు అనుగుణంగా కృత్రిమ చేతులు,కాళ్లు ఏర్పాటు చేయించాల నే సంకల్పంతో ఈ మానవతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ,గతనెల సెప్టెంబర్ 30వ తేదీన బాన్సువాడ పట్టణ కేంద్రంలో ముగ్గురికి కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ సేవాకార్యక్రమాన్ని నియోజక వర్గం లోని ప్రతి గ్రామానికి విస్తరించి, అవసరమైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించాలన్నదే తన లక్ష్యం అని అన్నారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులకు,ప్రజా ప్రతినిధులు వారి వారి గ్రామాల్లో ఉన్న వికలాంగుడి ఇంటికి వెళ్లి, వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్ తో సహా, అంగవై కల్యానికి గల కారణాలు, అలాగే వారికి అవసరమైన సహాయక పరికరాల వివరాలను సేకరించి తనకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా దసరా పండుగ అనంతరం మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ క్యాంపుల నిర్వహణలో మీ సహకారం ఎంతో అవసరం ఉందని ,మీరు చేయా ల్సిందల్లా ఒక్కటే.మీ గ్రామాల్లో అంగవై కల్యం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి,వారికి సమాచారం అందించి, క్యాంపుల వరకు తీసుకు రావాలని పిలుపునిచ్చారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా కృత్రిమ అవయ వాలను పొందలేక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలబడి, వారుఆత్మ విశ్వా సంతో తమ జీవితాలను కొన సాగించేలా చేయూత నివ్వడమేఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అని అన్నారు.మన చిన్న ప్రయ త్నం ఒకరి జీవితంలో గొప్ప మార్పుకు నాంది కావచ్చు అని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయానికి దూరం ఉండకుండా. ప్రతి అర్హుడికీ సహాయం అందేలా మనమంతా సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

Clip Adjustments