Back to Home
Watermark
ఆదివారం, 11 అక్టోబర్, 2026 TIME : 11:21 AM

ముగ్గురు సీజేపీ నేతల విడుదల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ

​న్యూఢిల్లీ (తెలంగాణ అడ్డ):

ఢిల్లీలో అరెస్ట్ అయిన ముగ్గురు సీజేపీ (CJP) నాయకులకు ఊరట లభించింది. పోలీసులు అరెస్ట్ చేసిన సీజేపీ నాయకులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, విచారణ అనంతరం వారిని తక్షణమే విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

​మేజిస్ట్రేట్ ఆదేశాలతో విడుదల:

ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ విడుదలయ్యారు.

​మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్:

తన విడుదల అనంతరం సీజేపీ నేత అశుతోష్ రంకా మాట్లాడుతూ.. తాజా పరిణామాలు, తమ అరెస్ట్ ఉదంతంపై మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం (ప్రెస్ కాన్ఫరెన్స్) నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

Clip Adjustments