నేను గెలిస్తే పార్టీ గెలిచినట్లే.. నేను ఓడితే పార్టీ ఓడినట్లే..

మూడవసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించేది కేసీఆరే.
యువకులే కథానాయకులు కావాలి.
ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి...ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి.

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా నేను గెలిస్తే పార్టీ గెలిచినట్లే, నేను ఓడిపోతే పార్టీ ఓడినట్లే అని ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మణుగూరు పట్టణం లోని హనుమాన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన పినపాక నియోజకవర్గం సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఏడు మండలాల పార్టీ నాయకులను ఉద్దేశించి కీలక వాఖ్యలు చేశారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. యువకులే కథానాయకుడు కావాలి. పట్టభద్రుల ఆచూకీ తెలుసుకోండి,
నేను గెలిస్తే పార్టీ గెలిచినట్లు,నేను ఓడిపోతే పార్టీ ఓడిపోయినట్లే. అందుకే మొదటి ప్రాధాన్యత ఓటు కోసం గ్రాడ్యుయేట్స్ ని కలిసి ఎన్రోల్మెంట్ చేయండి అని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా లేరని,ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రజలు మండిపడుతున్నారని ఆరోపించా రు.ఒకరి మీద ఒకరు శాడీలు చెప్పు కుంటే ఓట్లురావు అని ఓటర్ల ప్రేమను పొందాలి అని కోరారు.వారితో మమేకమై తిరగాలి. పట్టభద్రుల్లో నమ్మకం కలిగించాలి అని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 420 పథకాలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఘాటు గా విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపో వడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తే, ఎవరు గెలవమనే నమ్మకం వారిలో కలిగి ముందుకు రావడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చా ర్జీలు ప్రతి రోజు ఉదయం,సాయంత్రం రెండు గంటలు గ్రాడ్యుయేట్స్ ను కలిసి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తనను ఎమ్మెల్సీ గా గెలిపిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో రేగా కాంతారావును గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించి గెలిపించి తీరుతానని

పేర్కొన్నారు. అదేవిధంగా మూడవసారి ముచ్చటగా కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, తద్వారా రేగా కాంతారావు కూడా మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల లో గుర్తు నిశ్చయంతో యువకులు కథానా యకులై కంకణ బాధ్యులై ప్రచారం నిర్వ హించి ఎమ్మెల్సీగా గెలిపించి కెసిఆర్ కు కానుకగా అందించాల్సిన అవసరం మనపై ఉందని పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి మణుగూరు విచ్చేసిన రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు, ఏడు మండలాల సర్పంచులు ఎంపీటీసీలు ఏ ఏం సి డైరెక్టర్లు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బి ఆర్ ఎస్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన 40 మంది ఉద్యమ కారులను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావు,ఉద్యమ నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లా,మాజీ గ్రంథాలయ చైర్మన్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దిండిగాల రాజేందర్ చేతుల మీదుగా శాలువా,పూల బొకేలతో ఘనంగా సన్మానించారు.