కరీంనగర్ కమిషనరేట్‌లో రెండేళ్లు పూర్తి చేసుకున్న పోలీస్ అధికారుల బదిలీలు ఉండనున్నాయా?

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఒకేచోట రెండేళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్న పోలీస్ అధికారులకు స్థానచలనం కలుగనుందా? సాధారణ పరిపాలనాపరమైన మార్పుల్లో భాగంగా బదిలీల ప్రక్రియ ఉండనుందా అనే చర్చ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
సాధారణ ప్రక్రియపై చర్చ!
నగరంలోని వివిధ స్టేషన్లు పనిచేస్తున్న అధికారుల పదవీకాలాన్ని బట్టి ఈ మార్పులు ఉంటాయా అని స్థానికంగా చర్చ జరుగుతోంది.
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ?
పోలీస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్టమైన శాఖాపరమైన వివరాలు వెలువడనప్పటికీ, సాధారణ పరిపాలనా సర్వీసు నిబంధనల దృష్ట్యా దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.!