Back to Home
Watermark
సోమవారం, 12 అక్టోబర్, 2026 TIME : 05:09 PM

బాన్సువాడ, చందూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

Main Image

ముఖ్య అతిథిగా పాల్గొన్న పోచారం శ్రీనివాస రెడ్డి.

తెలంగాణ అడ్డా /బోధన్ డివిజన్ ప్రతినిధి:

Additional Image

బాన్సువాడ పట్టణంలోని వెయ్యి డబుల్ బెడ్‌రూం కాలనీలో, చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయసలహాదారులు బాన్సు వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ,మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు బాన్సువాడ పట్టణంలోని వెయ్యి డబుల్ బెడ్‌రూం కాలనీలో ఏర్పాటు చేసిన 44 అడుగుల భారీ బతుకమ్మ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బతుకమ్మ గా నిర్వాహకులు అభివర్ణించారు. ఈ భారీ బతుకమ్మ ను చూసేందుకు ప్రజలు ఆసక్తి కన బరిచారు.ఈసందర్భంగాబాన్సువాడ పట్టణం, చందూర్ మండల కేంద్రానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంక రించి తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాల గొప్ప తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ తకు,ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆనందో త్సాహాల మధ్య సందడిగా సాగాయి.ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ పట్టణ, చందూర్ మండలప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Clip Adjustments