Back to Home
Watermark
మంగళవారం, 13 అక్టోబర్, 2026 TIME : 10:41 PM

భక్తిశ్రద్ధలతో దుర్గామాత దీపోత్సవం గల్లీ గ్యాంగ్ శక్తి బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

Main Image

భక్తిశ్రద్ధలతో దుర్గామాత దీపోత్సవం

గల్లీ గ్యాంగ్ శక్తి బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ అడ్డా ప్రతినిధి గన్నేరువరం

గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో

దుర్గామాత సన్నిధిలో గల్లీ గ్యాంగ్ శక్తి బృందం ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి దీపాలు వెలిగించి పూజలు చేశారు.

దీపాల వెలుగులతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి కృపాకటాక్షాలు బృంద సభ్యులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

Clip Adjustments