Back to Home
Watermark
గురువారం, 15 అక్టోబర్, 2026 TIME : 06:00 PM

జర్నలిస్టులపై పోలీసుల అణచివేత దారుణం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విలేకరుల పరామర్శ

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీసుల చిత్రహింసలపై తీవ్ర ఆగ్రహం

బాధితులను పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన, పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో విలేకరులుగా విధులు నిర్వర్తిస్తున్న పొత్తూరి శేఖర్ మరియు రాతిపల్లి సంపత్‌లను పోలీసులు అన్యాయంగా చిత్రహింసలకు గురి చేయడం అత్యంత దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యంతో తీవ్ర గాయాలపాలై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్న ఆ జర్నలిస్టులను గురువారం తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారి ఆదేశానుసారం పలువురు ప్రముఖులు పరామర్శించారు.

పరామర్శించిన ప్రముఖులు:

ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ లింగంపల్లి నాగరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్, మ్యాకల తిరుపతి, బసవేణి రాజేందర్, మడిపల్లి వినీత్, చిట్టంపల్లి నాగరాజు, పల్లె శారద, కొత్తూరి రఘు తదితరులు పాల్గొన్నారు

జర్నలిస్టులకు అండగా ఉంటాం:

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్థూపమైన జర్నలిస్టులపై పోలీసులు ఈ విధంగా దాడులు చేయడం, చిత్రహింసలకు గురి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. బాధితులకు అండగా నిలవడంతో పాటు, బాధ్యులైన పోలీసులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

Clip Adjustments