Back to Home
Watermark
శనివారం, 17 అక్టోబర్, 2026 TIME : 12:36 AM

నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

పూల పండుగను కోలాహలంగా జరుపుకున్న మున్సిపల్ అధికారులు, మహిళా ఉద్యోగులు

పాల్గొన్న మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నాడు అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో మున్సిపల్ సిబ్బంది, మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి కార్యాలయ ప్రాంగణంలో శోభాయమానంగా కొలువుదీర్చారు.

Additional Image

ఈ వేడుకల్లో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ

తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని అన్నారు. కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలోనూ, ప్రజలకు సేవ చేయడంలోనూ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. పండుగల వేళ నగర ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని ఆకాంక్షించారు. పాలకవర్గం మరియు అధికారులు కలసికట్టుగా పండుగ వాతావరణంలో పాల్గొనడం, ఉద్యోగుల మధ్య ఐక్యతను ప్రతిబింబించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments