సాబాష్‌పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

ఆకట్టుకున్న విద్యుత్ దీపాలంకరణ.. మహిళల ఆటపాటలతో పల్లెలో పండుగ సందడి
తెలంగాణ అడ్డా వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం సాబాష్‌పల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ మహిళలు, ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడిపాడుతూ సందడి చేశారు.
వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలిరంగు లైటింగ్‌తో వెలిగిన వేదిక, విద్యుత్ దీపాల కాంతులతో పండుగ ప్రాంగణం కొత్త శోభను సంతరించుకుంది.
గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సర్పంచ్ ఏ.టి. యాదవ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ వేడుకలు గ్రామంలో ఐక్యతను, తెలంగాణ సంస్కృతి పట్ల ప్రజలకున్న అభిమానాన్ని చాటిచెప్పాయి.