కీసర మాజీ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ. 2.28 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ఏకకాలంలో బంధువులు, బినామీల ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు
లంచం కేసులో ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉన్న ఆంజనేయులుపై పీటీ వారెంట్‌తో విచారణ
మేడ్చల్-మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. శనివారం ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలు:
సరూర్ నగర్, ఎల్బీనగర్, పేరూరులలో ఇళ్లు మరియు ప్లాట్లు గుర్తింపు.
మిర్యాలగూడ హాలియాలో 2 ఎకరాల వ్యవసాయ భూమి స్వాధీనం.
రూ. 7 లక్షల నగదు, 60 తులాల బంగారం, విటారా బ్రెజ్జా కారు లభ్యం.
మొత్తం ఆస్తుల ప్రభుత్వ విలువే సుమారు రూ. 2,28,50,000/- కాగా, బహిరంగ మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది.
గత నెలలో లంచం తీసుకుంటూ పట్టుబడి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆంజనేయులుపై ఏసీబీ అధికారులు పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టనున్నారు.
ఎవరైనా లంచం అడిగితే సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్: 1064