Back to Home
Watermark
ఆదివారం, 18 అక్టోబర్, 2026 TIME : 12:07 AM

గంబీరావుపేట ఎస్సై శ్రీకాంత్ సస్పెన్షన్!

Main Image

రాజన్న సిరిసిల్ల,కరీంనగర్ (తెలంగాణ అడ్డా)

విధుల నిర్లక్ష్యం, థర్డ్ డిగ్రీ ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు

ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్సై సీహెచ్. శ్రీకాంత్‌పై శాఖాపరమైన తీవ్ర చర్యలు తీసుకోబడ్డాయి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం మరియు విచారణ పేరుతో "థర్డ్ డిగ్రీ" ప్రయోగించారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సస్పెన్షన్ కాలంలో ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. బాధ్యతాయుతమైన పోలీసు శాఖలో ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకోవడం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమైంది.

Clip Adjustments