ఉచితంగా ప్రకటనలు...? ప్రకటనలకు ముఖం చాటు....!.

జర్నలిస్టుల వార్తలతో రాజకీయ ప్రచారం... ప్రకటనల దగ్గర మాత్రం చేతులెత్తేస్తారా?
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
ఏడాది పొడవునా రాజకీయ నాయ కుల కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు, ప్రకటనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు వార్తలు రాస్తూనే ఉంటారు. ఎలాంటి ప్రతి ఫలం ఆశించకుండా తమ వృత్తిలో భాగంగా రాజకీయ నాయకులకు ప్రచారం కల్పిస్తుంటారు.కానీ ఏడా దికి రెండుసార్లు వచ్చే దసరా, నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల విషయంలో మాత్రం కొందరు రాజకీయ నాయకులు ముఖం చాటేయడం ఎంతవరకు సమంజసం?
వార్తలు కావాలంటే గుర్తొస్తారు.. ప్రకటనలు అడిగితే కనిపించరా?
జర్నలిస్టులు ప్రకటనల కోసం కార్యాల యాలకు వస్తే కనీస స్పందన కూడా ఇవ్వకపోవడం, ప్రకటనల విషయంలో తప్పించుకోవడం ఎంతవరకు న్యాయం? ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తమ హోదాకు తగిన విధంగా వ్యవహ రించా ల్సిన అవసరం లేదా.మీరు ఏ పార్టీలో ఉన్నా,ఏ పదవిలో ఉన్నా..మీ కార్యక్ర మాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్రను విస్మరించకండి. రాజకీయ నాయకుల కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం జర్నలిస్టుల వృత్తిలో భాగమే. అదే సమయంలో పత్రికల నిర్వహణకు, జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలకు ప్రకటనలు కూడా ఎంతో తోడ్పడతాయి.
జర్నలిస్టు మిత్రులకు ఒక విజ్ఞప్తి..
ప్రకటనల కోసం వెళ్లినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకుల విషయంలో సంఘటితంగా, వృత్తి గౌరవాన్ని కాపాడుకునేలా నిర్ణయం తీసుకోండి. ప్రకటనలు ఇవ్వకుండా తప్పించుకునే వారి వార్తలకు ప్రచారం కల్పించే విషయంలో మీ సంఘం విధానాల ప్రకారం సమిష్టిగా చర్చించండి. వార్తల విషయంలో వృత్తి ప్రమాణాలను పాటిస్తూనే, ప్రకటనల విషయంలోనూ పరస్పర గౌరవం ఉండేలా కృషి చేయండి.
గుర్తుంచుకోండి.. జర్నలిస్టులు ఎవరికీ వ్యతిరేకం కాదు. అలాగే ఎవరి ప్రచారానికీ బానిసలు కాదు.
ప్రజాప్రతినిధుల కార్యక్రమాలకు వార్తా ప్రాధాన్యం ఉంటే ప్రచురించడం వృత్తి ధర్మం. అదే సమయంలో జర్నలిస్టుల కృషిని గుర్తించి, ప్రకట నల విషయంలోనూ న్యాయంగా స్పందించడం ప్రజాప్రతినిధుల బాధ్య త.వార్తలు ఉచితంగా రాయించు కోవ డం మాత్రమే కాదు.. జర్నలిస్టుల వృత్తిని గౌరవించడం కూడా నేర్చుకోండి.