Back to Home
Watermark
ఆదివారం, 18 అక్టోబర్, 2026 TIME : 08:42 AM

బూరుగుపల్లి గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్

Main Image

బూరుగుపల్లి గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్

తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

ఆడపడుచులకు పండగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని

గ్రామంలో పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష

బోయిన్పల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న బతుకమ్మ పండుగ వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. గ్రామ ప్రజలు ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. బూరుగుపల్లి గ్రామ ప్రజలందరికీ మరోసారి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు

Clip Adjustments