Back to Home
Watermark
ఆదివారం, 18 అక్టోబర్, 2026 TIME : 12:05 PM

బూరుగుపల్లి ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ నాయకులు సురుగు నాంపల్లి

Main Image

ప్రకృతిని ఆరాధించే గొప్ప సాంప్రదాయం బతుకమ్మ

తెలంగాణ అడ్డా బోయినీపల్లి ప్రతినిధి

సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలందరికీ సీనియర్ కాంగ్రేస్ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని పేర్కొన్నారు. ఆడపడుచుల ఆత్మీయతకు, కుటుంబాల ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

ఈ సద్దుల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ పండుగల విశిష్టతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.

Clip Adjustments