బోయినిపల్లి, దేశాయిపల్లి ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

>పండగను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
>ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు
>కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ అడ్డా బోయినపల్లి
బోయినిపల్లి, దేశాయిపల్లి గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు.
తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతుందని అన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపుతుందని పేర్కొన్నారు.
పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలందరూ సద్దుల బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ పండుగ ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తూ బోయినిపల్లి, దేశాయిపల్లి, పరిసర గ్రామాల ప్రజలందరికీ మరోసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.